AP: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈ నెల 4న నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా వంటి ప్రముఖులు అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని కూడా ఆమె స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను సీఐఐ సదస్సుకు ఆహ్వానిస్తారు.