AP: ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని అంశాల్లో ఆప్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా అభివర్ణించారు. ఆస్పత్రుల నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.