కూటమి నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

11చూసినవారు
కూటమి నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
AP: కూటమి నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పాల్గొన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలను దక్కించుకోవాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్