మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా

9148చూసినవారు
మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా
AP: విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సీపీలను ఆదేశించిన సీఎం, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్