మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

2చూసినవారు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు సీరియస్
AP: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యం చేసుకుంటున్నారన్న విషయంపై సీఎం ఆగ్రహించారు. రాజకీయాలకు ఆయనను దూరంగా ఉంచాలని హెచ్చరించారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్, గత ఆరు నెలలుగా తన తండ్రి ఎలాంటి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. అయితే తన వద్ద పూర్తి నివేదికలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చానని గుర్తుచేసిన చంద్రబాబు, పనితీరు మార్చుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్