AP: అమరావతి సచివాలయంలో ‘ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్’ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ అంశాల్లో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అందించే డ్రోన్ సేవలను ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చని సీఎం పేర్కొన్నారు. డ్రోన్ల తయారీలో రాష్ట్రాన్ని హబ్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే డ్రోన్ రంగంలోని పెట్టుబడిదారులు, వ్యాపారులు, ప్రజలను అనుసంధానం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడనుంది.