గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం గురించి చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు. కాగా ఏపీ మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు, త్వరలోనే సీఎం ఢిల్లీ పర్యటన దృష్ట్యా గవర్నర్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.