AP: విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో
ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరిపారు. విశాఖ దేశంలోనే అత్యంత సుందరమైన నగరమని, పర్యాటకానికి అత్యంత అనువైన ప్రదేశమని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో యూరోపియన్ భాగస్వామ్యం కావాలని కోరారు.