స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

87చూసినవారు
స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పేదల సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్నారు. గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లె గ్రామంలో జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వృద్ధాప్య, వితంతు పింఛన్లను స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.