తుఫాను నష్టంపై అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి!

59చూసినవారు
తుఫాను నష్టంపై అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి!
అర్నబ్, మురసు తుఫాన్ల ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన భారీ నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రానికి రూ.343.95 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇందులో రూ.324.22 కోట్లు వ్యవసాయ రంగానివేనని పేర్కొన్నారు. 7 జిల్లాల్లో 50,473 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని, 69,828 మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, కేంద్రం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్