AP: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చామవరంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.