GOOD NEWS చెప్పిన సీఎం చంద్రబాబు

63చూసినవారు
GOOD NEWS చెప్పిన సీఎం చంద్రబాబు
AP: విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే కొత్త పథకం తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నీట్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అదే సమయంలో ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన జరగనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్