మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు

53చూసినవారు
మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. మద్దతు ధర లభిస్తే వేలాది మంది రైతులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్