AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని, జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.