AP: ప్రకాశం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు నేడు పాల్గొననున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.15కు లింగన్నపాలెం చేరుకుంటారు. అనంతరం 10.35 నుంచి 12.15 వరకు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 12.30కు హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.