నేటి నుంచి రెండు రోజులపాటు తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

6722చూసినవారు
నేటి నుంచి రెండు రోజులపాటు తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు జులై 1, 2 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. మొదటి రోజు సత్యవేడు మండలం మాదనపాలెంలో హీరో మోటర్స్‌ ప్లాంట్‌ విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. జులై 2న రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, కమలేశ్‌ పాశ్వాన్‌, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లతో కలిసి వీబీజీ రామ్‌జీ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్