AP: సీఎం చంద్రబాబు బుధవారం నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారు. అనంతరం పాతూరులో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొంటారు. రాత్రికి సీఎం ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.