AP: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 71 సార్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారని వైసీపీ ఆరోపించింది. గురువారం ఎక్స్ వేదికగా.. ‘ఖర్చు మనది కాకపోతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ అంతరిక్షానికైనా వెళ్తారు. 16 నెలల్లో చంద్రబాబు 71 సార్లు, మంత్రి లోకేశ్ 77 సార్లు, పవన్ అప్పుడు, ఇప్పుడు విజయవాడలో ఉన్నది వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు’ అని వైసీపీ ట్వీట్ చేసింది.