రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష (వీడియో)

2చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ నుంచి రైల్ రవాణా, రాయలసీమ నుంచి కోస్తాంధ్రకు కనెక్టివిటీ, గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. విశాఖ, విజయవాడ, గుంతకల్ వంటి రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించడం, విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు వంటి కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలను కూడా సీఎం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్