AP: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సీఎం ఆదేశించారు.