వైద్యారోగ్యశాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

9253చూసినవారు
వైద్యారోగ్యశాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష
AP: వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలుపై ప్రధానంగా చర్చించారు. జనవరి నెల నుంచి ఈ 'సంజీవని ప్రాజెక్టు'ను మొదట చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జనవరి నెల పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్