AP: అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు గనుల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము వంటి ఖనిజాలకు వ్యాల్యూ అడిషన్ చేయడం ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం సమకూర్చే అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఖనిజ సంపదపై మార్కెట్ క్యాపిటలైజేషన్ అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఆదాయ వనరులను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.