పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

27556చూసినవారు
పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక
AP: సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి సందర్భంగా పారిశ్రామికవేత్తలకు తీపి కబురు అందించారు. పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రోత్సాహకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తొలి విడతగా రూ.1,500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్