AP: సీఎం చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన ‘393’ అంబాసిడర్ కారు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాత వాహనాన్ని పార్టీ కార్యాలయంలో పరిశీలించిన చంద్రబాబు, దానితో తన అనుబంధ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పర్యటించిన సమయంలో ఈ అంబాసిడర్ కారు ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఇకపై ఈ వాహనాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అపురూపంగా భద్రపరచనున్నారు. సీఎం ప్రేమతో దాచుకున్న కారు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.