AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, నదుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించాలని, ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.