ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి (గురువారం) అరకు పర్యటన రద్దు అయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు బారామతి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే అరకు పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేశ్ కూడా అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.