జులై 1 నుంచి మూడు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

7109చూసినవారు
జులై 1 నుంచి మూడు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు జులై 1 నుంచి 5 వరకు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరులో పింఛన్ల పంపిణీ, తిరుపతిలో హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. తిరుపతిలో GSDP కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్‌కు హాజరవుతారు. కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, 5వ తేదీన అమరావతికి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్