రేపు సింగపూర్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు

36చూసినవారు
రేపు సింగపూర్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు రేపటి నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సీఎం బృందంలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, అమరావతి నిర్మాణ పురోగతి తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్