లక్ష్మీనాయుడు హత్యను ఖండించిన సీఎం.. పరిహారం ప్రకటన

34చూసినవారు
లక్ష్మీనాయుడు హత్యను ఖండించిన సీఎం.. పరిహారం ప్రకటన
AP: నెల్లూరు(D) గుడ్లూరు(M) రాళ్లపాడులో చోటు చేసుకున్న లక్ష్మీనాయుడు హత్య ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ మేరకు లక్ష్మీనాయుడు హత్యను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అలాగే మృతుడి కుటుంబానికి 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున నగదు ఇవ్వనున్నారు. పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటదని చెప్పారు.

సంబంధిత పోస్ట్