AP: రాయలసీమలోని కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులతో కలిసి ఆయన పనులను లాంఛనంగా మొదలుపెట్టారు. అనంతరం, జేఎస్‌డబ్ల్యూ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను, జేఎస్‌డబ్ల్యూ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను సీఎం పరిశీలించారు.