ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం

28960చూసినవారు
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం
AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. APNRTS ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు దుబాయ్‌లో ప్రారంభించారు. ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా రూ.10 లక్షలు అందుతాయి. https://apnrts.ap.gov.in/insurance వెబ్‌సైట్‌లో మీ వివరాలు నమోదు చేయాలి.