సుప్రీం కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన సీఎం మమతా బెనర్జీ

10929చూసినవారు
సుప్రీం కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన సీఎం మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో బుధవారం లాయర్‌గా అవతారమెత్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియపై స్వయంగా వాదనలు వినిపించారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో, బెంగాల్‌లో SIRను తప్పుగా అమలు చేస్తున్నారని, ఇది ఓటర్లలో భయాన్ని కలిగిస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలకు స్పందన లేదని తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కేసు విచారణను ఫిబ్రవరి 9కు వాయిదా వేసింది. స్వయంగా వాదనలు వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్