సీఎం ఆదేశం.. డాక్టర్ నారాయణ స్వామిపై సస్పెన్షన్ వేటు

85చూసినవారు
సీఎం ఆదేశం.. డాక్టర్ నారాయణ స్వామిపై సస్పెన్షన్ వేటు
AP: విధుల్లో నిర్లక్ష్యం వహించిన నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి.నారాయణ స్వామిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 26న నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసి.. ఆమె శరీరంలో సర్జికల్ బ్లేడ్ వదిలేశారు. అనంతరం జరిపిన వైద్య పరీక్షల్లో సర్జికల్ బ్లేడ్ శరీరంలో వదిలేసినట్లు వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్