30 రోజులు జైల్లో ఉంటే పదవులు గల్లంతు.. సవరణ బిల్లుకు కేంద్రం సిద్ధం

17261చూసినవారు
30 రోజులు జైల్లో ఉంటే పదవులు గల్లంతు.. సవరణ బిల్లుకు కేంద్రం సిద్ధం
రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (జులై 21 - ఆగస్టు 21) కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లు ప్రకారం.. క్రిమినల్ లేదా అవినీతి కేసుల్లో అరెస్టయి, వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోతారు. రాజకీయాల్లో అవినీతిని అరికట్టే ఈ చట్టం ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఈ సమావేశాల ప్రారంభంలోనే తన నివేదికను సమర్పించనుంది. బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.

సంబంధిత పోస్ట్