త్వరలో ‘సీఎం ఉపాధి కల్పన పథకం ప్రారంభం

0చూసినవారు
త్వరలో ‘సీఎం ఉపాధి కల్పన పథకం ప్రారంభం
AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'సీఎం ఉపాధి కల్పన’ (CMEGP) పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ పథకానికి ఏటా రూ.300 కోట్లు కేటాయించనున్నారు. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సేవా రంగంలో రూ.2 లక్షల నుండి రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈనెల 10న కేబినెట్‌లో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్