ఏపీని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కర్నూలును ఏవియేషన్, డ్రోన్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, దేశంలోని బలమైన ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌టీఓ) విస్తరించేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆదివారం కర్నూలు ఎయిర్‌పోర్టులో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.