AP: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో, కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు 31 కొత్త పోస్టులను మంజూరు చేశారు. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన హెచ్చరించారు.