AP: కాకినాడలోని భానుగుడి సెంటర్లో ఓ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ వస్తున్నట్లు అందులో ఉండటంతో ప్రచారం జోరందుకుంది. అయితే, ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులకు సమాచారం లేదని, కళాశాల యాజమాన్యం కూడా స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.