తమిళనాడు సీఎం విజయ్ కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం కర్ణాటక కొల్లూరులోని మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అయితే ప్రత్యేక పూజల అనంతరం విజయ్ స్వయంగా 130 కి.మీ కారు నడుపుకుంటూ వెళ్లారు. మంగళూరు ఎయిర్‌పోర్టు దాకా కాన్వాయ్‌తో పాటు విజయ్ డ్రైవ్ చేశారు. టోల్‌గేట్ వద్ద అభిమానులకు ఆయన చేయి ఊపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.