మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త: డ్వాక్రా సంఘాలకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్

5చూసినవారు
మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త: డ్వాక్రా సంఘాలకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 వేల డ్వాక్రా సంఘాలకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను ప్రకటించింది. ప్రతి సంఘానికి రూ.15 వేల చొప్పున ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధి సంఘం నిధిని పెంచడానికి, సభ్యుల అవసరాలకు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో డ్వాక్రా మహిళల అకౌంట్లో రూ. 15 వేల రూపాయిలు జమ కానున్నాయి.

సంబంధిత పోస్ట్