AP: పరకామణి అంశంపై శాసనమండలిలో చర్చించామని, రానున్న రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆదివారం ఆయన పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటిస్తూ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుమలలోని పరకామణి విషయంలో శాసనసభ స్పీకర్ సమయం ఇవ్వక పోవడం వల్ల మాట్లాడలేకపోయామన్నారు.