అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, అంగన్వాడీల 9 డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చినట్లు పేర్కొన్నారు. అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి కొనియాడారు.