AP: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. రూ. 5.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి 9 డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చినట్లు తెలిపారు. అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల అన్నారు.