కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించింది. సుమారు రూ.4,497 కోట్ల విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు నిర్ణయించింది. ట్రూడౌన్ కింద ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. గత ఏడాది సెప్టెంబరులో రూ.923 కోట్లు తగ్గించిన ప్రభుత్వం, తాజాగా మళ్లీ చార్జీలు తగ్గించడంతో ప్రజలకు మేలు చేకూరుతుందని అంటున్నారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విద్యుత్ వ్యవస్థ గాడిన పడిందని, విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గడం వల్లే ఈ ఉపశమనం సాధ్యమైందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.