తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వెలువడిన సిట్ నివేదిక ఆధారంగా, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందుంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గురువారం నాడు భేటీ కానున్నారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావన లేదన్న వైసీపీ వాదనను ఖండించి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను వివరించేందుకు ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడంపై చర్చించనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, దోషులను చట్టం ముందు నిలబెట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.