పూజ గదిలో ప్రత్యక్షమైన నాగుపాము.. భయంతో పరుగులు తీసిన కుటుంబం

6654చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని మహేందర్ ఇంట్లో పూజ గదిలోకి దైవ స్వరూపంగా భావించే నాగుపాము ప్రవేశించింది. కుటుంబ సభ్యులు పూజ గదిలోకి వెళ్లగా, మూడు అడుగుల పొడవైన నాగుపాము పడగ విప్పి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. స్థానికులు కొందరు భక్తితో పాముకు పాలు సమర్పించి దండాలు పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సద్దాం, చాకచక్యంగా పామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎండల కారణంగా విషసర్పాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్