జోరుగా కొనసాగుతున్న కోడి పందేలు.. వీక్షకులతో కిక్కిరిసిన పందెం బరులు (వీడియో)

17చూసినవారు
ఏపీలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పండుగ వేళ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో పందెం బరులు పందెం రాయుళ్లతో కోలాహలంగా మారాయి. వేలాదిగా వీక్షకులు తరలివచ్చి పందేలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కోట్ల రూపాయల్లో బెట్టింగ్స్ సాగుతున్నట్లు సమాచారం. బరుల వద్ద సందడి నెలకొనగా, పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.