కొబ్బరి నీళ్లను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. వీటిని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మం, జీర్ణక్రియ, జుట్టు, కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర, రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని నియంత్రించడంలో ఇవి తోడ్పడతాయి. శరీరానికి తక్షణ శక్తిని, ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమమని అంటున్నారు. వేసవిలో కూల్ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరి నీళ్లను ఎంచుకోవడం మంచిది.