ఏపీలో చలి ప్రభావం తీవ్రమవుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది. జి.మాడుగులలో 5.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 7.7, దుబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.