కుప్పకూలిన పొగాకు ధరలు

11చూసినవారు
కుప్పకూలిన పొగాకు ధరలు
AP: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళన నెలకొంది. గత ఏడాది కిలో రూ.366 వరకు పలికిన సాధారణ రకం పొగాకును ఈసారి వ్యాపారులు రూ.160కి కూడా కొనడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కిలో కనీసం రూ.200కు కొనాలని ఆదేశించినా అది అమలు కావడం లేదు. ఈ సీజన్‌లో 147 మిలియన్ కిలోల దిగుబడి రాగా, ఇప్పటివరకు కేవలం 20 మిలియన్ కిలోలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో పొగాకు వేలం కేంద్రాల్లో బేళ్లు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you